Thursday 19 December 2013

ముడుతల కోసం ఇంటిలో తయారు చేసుకొనే క్రీములు

మనకి వయస్సు పెరుగుతున్న కొద్ది మన చర్మం స్థితిస్థాపకత కోల్పోవడం జరుగుతుంది. చర్మం స్థితిస్థాపకత కోల్పోతే ధృడంగా లేదా చెక్కుచెదరకుండా ఉండదు. అందువలన ముడుతలు,డార్క్ సర్కిల్స్,ఫైన్ లైన్లు వంటి వాటికీ కారణం అవుతుందని అంగీకరిస్తున్నాము. సాదారణంగా మహిళలకు వృద్ధాప్య చిహ్నాలు వచ్చాయని పీడకలలు వస్తూ ఉంటాయి. వారు ముడుతలు మరియు వృద్ధాప్యం చిహ్నాలను నివారించేందుకు క్రీములు మరియు అందం ఉత్పత్తులను టన్నుల కొద్ది మరియు మిలియన్ల కొద్ది ఉపయోగిస్తూ ఉంటారు. ముడుతలు,కర్లింగ్ చర్మం మరియు ఫైన్ లైన్లు తగ్గించేందుకు అనేక క్రీములు ఉన్నాయి. ఏ చర్మ రకానికి అయిన రసాయన ఆధారిత సౌందర్య సాధనాలు సమర్థవంతమైనవి కాదు. ఎందుకంటే అంటువ్యాధులు,దద్దుర్లు మరియు మచ్చల వంటి ప్రతికూల ప్రభావాలకు కారణం కావచ్చు. ముడుతలు మరియు వయస్సు మీద పడిన ఇతర చిహ్నాల కొరకు ఇంట్లో తయారు చేసిన క్రీములు ఉపయోగించటం అనేది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇంట్లో తయారుచేసే క్రీములు సహజమైన ఉత్పత్తులను ఉపయోగించి తయారుచేయుట వలన ఏ విధంగానూ హానికరం కాదు. అవి శాశ్వత ప్రభావం కలిగి ఉంటాయి. ఏ చర్మ రకానికి అయిన ముడుతల కొరకు సహజమైన మరియు ఇంట్లో తయారుచేసే క్రీములు అందుబాటులో ఉన్నాయి. అనేక మంది మహిళలకు ముడుతలు మరియు వృద్ధాప్యం చిహ్నాలు తగ్గించడానికి ఉపయోగకరమైన కొన్ని హోమ్మేడ్ క్రీములు ఉన్నాయి.

No comments:

Post a Comment