Monday 16 December 2013

కాకరకాయ రైతా డయాబెటిక్ స్పెషల్

 
బిట్టర్ గార్డ్(కాకరకాయ)చాలా చేదు కలిగినటువంటి వెజిటేబుల్, అయితే, సరైన పద్దతిలో వండటం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది. బిట్టర్ గార్డ్ లేదా బిట్టర్ మెలోన్ లో కార్బోహైడ్రేట్స్, పొటాషియం మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. ఈ వెజిటేబుల్ డయాబెటిక్, బ్లడ్ డిజార్డర్, పైల్స్ పేషంట్స్ కు చాలా మంచింది. అటువంటి బిట్టర్ గార్డ్ తో ఒక రుచికరమైన బిట్టర్ గార్డ్ రైతా రిసిపి ఎలా తయారుచేయాలో క్రింది పద్దతిని చూడండి. మరియు ఈ బిట్టర్ గార్డ్ రైతా, రైస్, పులావ్, బిసిబిలే బాత్ వంటివాటికి చాలా రుచికరంగా ఉంటుంది. 
 కావల్సిన పదార్థాలు: పెరుగు: 1cup 
కాకరకాయ ముక్కలు: 1cup
 జీలకర్ర: 1tsp
ధనియాల పొడి: 1tps
 పచ్చిమిర్చి ముక్కలు: 5
 నూనె: ఫ్రైకి సరిపడా 
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం: 1. ముందుగా కాకరకాయ ముక్కలను బియ్యం కడిగిన నీళ్ళలో నానబెట్టుకోవాలి. అరగంట నానబెట్టుట ద్వారా చేదు తగ్గిపోతుంది. 2. బియ్యం నీళ్ళలో నానబెట్టిన కాకరకాయ ముక్కలను ఎండులో అరగంట ఎండబెట్టాలి. తర్వాత నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. 3. కాకరకాయ ముక్కలు వేగుతున్నప్పుడే అందులో కొద్దిగా ఉప్పు చిలకరించాలి. 4. ఒప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, పచ్చిమర్చి ముక్కలు మరియు ఫ్రై చేసిపెట్టుకొన్న కాకరకాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి . ఈ టేస్టీ బిట్టర్ గార్డ్ రైతా వడ్డించడానికి రెడీ. 5. చివరగా కొత్తిర తరుగుతో బిట్టర్ గార్డ్ రైతాను గార్నిష్ చేయాలి. అంతే అన్నంతో పాటు బిట్టర్ గార్డ్ రైతాను సర్వ్ చేయాండి.

No comments:

Post a Comment