Wednesday 18 December 2013

పిక్సీ హెయిర్ కట్ సంరక్షణ చిట్కాలు

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచం రోజు రోజుకు ఫ్యాషన్ పెరిగిపోతోంది. అందులో పిక్స్ హెయిర్ కట్ లేటెస్ట్ ఫ్యాషన్. ఏదో ఒక రోజున మీరు కూడా పిక్స్ కట్ కోసం సలూన్ కు వెళ్ళాల్సి వస్తుంది. కానీ, ఇది కేవలం హెయిర్ కట్ చేయడం మత్రామే కాదు, కట్ చేసినప్పటి నుండి, ఆ హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చేయడంలోనే ఉంది అసలు చిక్కు అంతా. పిక్స్ హెయిర్ కట్ నిర్వహణ గురించి పూర్తిగా తెలుసుకొన్నప్పుడు దాన్ని నిర్వహిండం కష్టం కాదు. షేప్ కూడా అందంగా ఉంటుంది. అవును , కురుచ జుట్టు తక్కువ నిర్వహణ, కానీ షార్ట్ చేయించుకొన్న తర్వాత అవి స్ట్రాంగ్ గా మరియు ఆరోగ్యకరంగా పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది తక్కువ నిర్వణకు సమానం, కానీ తక్కువ నిర్వహణ, అంటే నిర్వహణ లేకుండా కాదు! కాబట్టి , ఖచ్చితంగా కొంత శ్రద్ధ తీసుకోవడం అవసరమవుతుంది . జుట్టు సాధారణ అవసరాలు , తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిక్స్ కట్ తిరిగి కట్ చేసుకోవల్సి వచ్చినప్పుడు, అదనపు జాగ్రత్త ఏం తీసుకోవాలి ? ఇక్కడ మీరు పూర్తిగా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి కొన్ని చిట్కాలున్నాయి. వాటిలో ఒకటి లేదా అన్ని చిట్కాలను ఎంపిక చేసుకోవచ్చు మీ పిక్స్ కట్ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.

స్ట్రెయిట్ హెయిర్ &పిక్స్ కట్స్: 
మీకు కురుచుగా, స్ట్రెయిట్ హెయిర్ కలిగి ఉన్నప్పుడు, ఆ జుట్టుకు మీరు డ్రైషాంపుతో తలస్నానం చేయాలి. ఇంకా మీరు జుట్టును శుభ్రం చేసుకోవడానికి అదనపు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. స్ట్రెయిట్ హెయిర్ తో పోల్చితే, షార్ట్ హెయిర్ ఎప్పుడూ చిక్కుపడవచ్చు. కాబట్టి, మీరు ఎప్పుడూ మీ జుట్టుకు షాంపూతో స్నానం చేసి మరియు శుభ్రంగా మరియు అందమైన జుట్టు కలిగి ఉండటం చాలా అవసరం . పగలు మీకు తలస్నానం చేయడానికి సమయం లేనప్పుడు, వీలైతే , రాత్రి సమయంలో తలస్నానం చేసి, హెయిర్ కండీషన్ అప్లైచేసి, హెయిర్ బ్లో చేసి, వదిలేయాలి .
 Wavy పిక్సీ కట్
 మీ జుట్టును మరింత అందంగా ఉంచుకోవడానికి కేశాలకు సహజ అనుభూతిని లేదా హెయిర్ జెల్ ను అప్లై చేసి కేశాలను స్ట్రెయిట్ గా ఉంచుకోవచ్చు. తర్వాత మీ నచ్చిన విధంగా మీరు బయటకు వెళ్ళవచ్చు. అలాగే మీరు కొన్ని కండీషనర్స్ లేదా జెల్స్ అప్లై చేసి, పిన్ చేసి వదిలేవయచ్చు. అవును, ఇది శుభ్రంగా మరియు చక్కగా ఉంచడానికి సహాయపడుతుంది. వారంలో రెండుసార్లు షాంపుతో తలస్నానం చేసి, హెయిర్ డ్రై చేయాలి. మీరు మరింత స్టైల్ గా కనబడాలంటే మీ జుట్టుకు హీట్ చేయాలి. ఇది బ్యూటీషియన్ల చేస్తారు.
 Curls & పిక్సీ కట్స్
 మీకు కర్లింగ్ హెయిర్ ఉన్నప్పుడు, మీరు అధిక నిర్వహాణ జుట్టును కలిగి ఉన్నారని అర్ధం. మీరు వారానికొకసారి తలస్నానం చేసినా కానీ, వాటిని చక్కగా నిర్వహించడానికి సరైన కండీషనర్స్ మరియు హెయిర్ జెల్స్ ఉపయోగించి నిర్వహించాల్సి ఉంటుంది. మీ జుట్టు మరింత అందంగా కనబడాలంటే, బ్లో డ్రై చేయించుకోవాలి. జుట్టును టైట్ గా హెయిర్ బ్యాండ్ లేదా ఇతర హెయిర్ ప్రొడక్ట్స్ చూడటానికిఆకట్టుకునే కనిపిస్తుంది. రాక్ పిక్స్: మీకు ఎటువంటి జుట్టు తత్వం ఉన్నాకూడా, మీ పిక్స్ కట్ ను ఏవింధంగా స్టైల్ చేయాలిని అని తెలుసుకోవాలి లేదా నేర్చుకోవాలి.స్ట్రెయిట్ హెయిర్ ఉన్న వారు, చిన్న హెయిర్ స్టైల్ చాలా ఉత్తమం. అది మీ కళ్ళను మరియు మీ చీక్ బోన్స్ ను హైలైట్ చేస్తుంది . ఫ్రించ్ బ్యాంగ్స్ మీ పిక్స్ కట్ కు చాలా అందుంగా మరియు స్టైలిష్ గా ఉంటుంది. లేయర్డ్స్ పిక్స్ కట్ ఎటువంటి జుట్టు రకానికైనా బాగుంటుంది. చూడటానికి అందంగా మరియు కర్లీగా కూడా ఉంటుంది . ఇంతకంటే అందంగా మరేం కావాలి . కాబట్టి, పిక్స్ కట్ నిర్వహించడం తెలుసుకోవాలి . తర్వాత ఒక మంచి స్టైలిష్ పిక్ కట్ ను చేసుకొని నిర్వహించండి . ఇది చూడటానికి చాలా అందంగా స్టైలిష్ గా ఉంటుంది.

No comments:

Post a Comment