Thursday 13 March 2014

లిప్ స్టిక్ ఎక్కువ సమయం....

లిప్ స్టిక్స్ ట్రెండ్ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ప్రతి సీజన్ లోనూ ట్రెండ్ కు తగ్గట్టుగా డిఫరెంట్ లిప్ స్టిక్ షేడ్స్ వస్తుంటాయి. సాధారణంగా మహిళల అలంకరణ వస్తువుల్లో తప్పనిసరిగా ఉండేటివి లిప్ స్టిక్ లేదా లిప్ గ్లాస్. తమ అందం కోసం ఎంతగా మేకప్ చేసుకొన్నా చివరికి పూర్తి అయ్యేది లిప్ స్టిక్ తోనే. వీటిలో కొందరు ముదురు రంగులు ఇష్టపడితే మరికొందరు కనిపించి కనిపించకుండా కవ్వించే రంగులను లేత రంగులు ఇష్టపడుతారు. పెదాల బ్యూటీనిపెంచే లిప్ స్టిక్ ఎక్కువ సమయం ఉండాలంటే
ముఖంలో ఆకర్షణీయంగా కనిపించే పెదవ్ఞలు, మరింత అందంగా కనిపించడానికి లిప్‌స్టిక్‌ రాసుకుంటారు. దీనికి కూడా కొన్ని చిట్కాలు ఉపయోగిస్తే మంచిది. 
1. సరిగా లిప్‌స్టిక్‌ వేసుకోకపోతే ఆకర్షణీయంగా కనబడరు సరికదా, మిమ్మల్ని చూసినవారు మీ గురించి చర్చించుకోవడం మాత్రం జరుగుతుంది.
 2. లిప్‌స్టిక్‌ రాసుకునే ముందు పాలతో ముంచిన దూదితో పెదాలను బాగా క్లీన్‌ చేసుకోవాలి. పెదాలు శుభ్రంగా లేకపోతే లిప్‌స్టిక్‌ మెరుపు, అందము కనపడదు. కాంతివంతంగా కూడా కనిపించవ్ఞ. పొరలు పొరలుగా ఉంటుంది. 
3. పెదాలు చాలా సున్నితమైనవి. అవకాశం లేకపోతే సబ్బుతో కడగండి. ఆరిన తరువాత లిప్‌స్టిక్‌ రాసుకోండి. వీలయినంత వరూ నీళ్ళు, పాలతో ముంచిన క్లాత్‌తోనే క్లీన్‌ చేసుకోండి. 
4. ఫౌండేషన్‌ క్రీము రాసుకుని బాగా ఆరనివ్వండి. ముందు లిప్‌స్టిక్‌ను ఆంటీఅంటనట్లుగా రాసుకుంటూ పోతూ క్రమంగా మెల్లమెల్లగా అద్దుకుంటూ పోవాలి.
 5. మంచి లిప్‌స్టిక్‌ అంటే దాని లక్షణాలు త్వరగా రంగు పోకూడదు. రంగు పాలిపోకూడదు. ఆహారము తీసుకుంటున్నా నీరు త్రాగినా రంగు పోకూడదు. లిప్‌స్టిక్‌ పెదాలను కాంతివంతంగా ఉంచటమే కాకుండా ముఖానికి సరికొత్త అందాన్ని తెచ్చిపెడుతుంది. లిప్‌స్టిక్‌ వేసుకునేటప్పుడు బ్రష్‌లను ఉపయోగించాలి.
 6. నిలబడి లిప్‌స్టిక్‌ వేసుకోవద్దు. ఎందుకంటే అలా చేస్తే చేతులు కదలిక ఉండటం వల్ల పరచుకొని పోతుంది. అలాంటప్పుడు పౌడర్‌ రాసుకుని లిప్‌స్టిక్‌ వేసుకోండి. 
7. లిప్‌స్టిక్‌ ట్యూబ్‌లు, స్టిక్కర్లు, పెన్సిళ్లు బయట మార్కెట్‌లో ద్రవరూపంలోనూ దొరుకు తాయి. లిప్‌స్టిక్‌ అంటే క్రొవ్ఞ్వ పదార్థము. ఆ పదార్థము పెదాలను దృఢంగా అంటుకునేలా చేస్తుంది. లిప్‌స్టిక్‌ వేసుకోగానే రంగు మారిపోతుంది. అలాంటప్పుడు బాక్స్‌మీద కలర్‌ చూసి, మంచి కంపెనీవి కొన్నా మీ పెదాలమీద లిప్‌స్టిక్‌ రాసుకోగానే రంగు మారిపోతుంటే దానికి కారణం మీకు పెదాలను పదేపదే కొరికే అలవాటు ఉండటం కారణం కావచ్చు. ఆ అలవాటు లిప్‌స్టిక్‌ అసలు రంగును మార్చేస్తుంది. గోధుమరంగు, ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ చాలా తేలికగా రాసుకునేవి దొరుకుతున్నాయి. కాబట్టి సింపుల్‌ లిప్‌స్టిక్‌లే వాడండి. నిద్రకుపక్రమించే ముందు, ఏ మాత్రం బద్ధకించకుండా లిప్‌స్టిక్‌ తొలగించే పని పెట్టుకోండి. ఆ తర్వాత నిద్రలోకి వెళ్ళండి. లిప్‌స్టిక్‌ తొలగించడానికి నాణ్యమైన కంపెనీకి సంబంధించినవే వాడండి. మీ సున్నితమైన పెదాలను అవి హాని చేయగలవు.

No comments:

Post a Comment