Saturday 15 March 2014

నిత్యం యవ్వనం-ఆరోగ్యంగా ...

ఎప్పటికైనా , ఎవరైనా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టక తప్పదు. కానీ వద్ధాప్యంలో పడ్డాక కూడా 'మీకు ఇంత వయసున్నట్టు కనబడరు అనే మెచ్చుకోలు పొందామంటే అది మన ఆరోగ్యాన్నీ, ఆహారపు అలవాట్లను సూచిస్తుంది. ఇంకా అనవసరపు ఆందోళనలకు లోనుకాకుండా, పొల్యూషన్‌ బారినపడకుండా ఉంటే కాలాన్ని పది- పదిహేనేళ్లు వెనక్కు తిప్పుకోవచ్చు. అదెలాగో పరిశీలిద్దామా! చిన్ననాటి నుంచే ఆహారపు అలవాట్లు ఒక క్రమపద్ధతిలో ఉంటే అది మన శరీర సౌందర్యానికి చక్కని పునాదిగా ఉపయోగపడుతుంది. శరీరానికి అందాల్సిన పోషకాలు, విటమిన్లు సమపాళ్లలో అందించాలి. ఆహారంలో నూనెలు, కొవ్వులు, కోలాలు, కాఫీలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవారి శరీరతత్వం సౌందర్యాన్నే సూచిస్తుంది. మీరు తినే ఆహారంలో తప్పనిసరిగా ఇక్కడ ఇచ్చినవి జత చేసుకుంటే 'మీరే కాలేజి అనిపించుకోవడం ఖాయం. ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచేవే కాక జీర్ణక్రియ చక్కగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. మీ ఆహారంలో అవి ఎంత శాతం ఉంటున్నాయో ఒకసారి చెక్‌ చేసుకోండి.

No comments:

Post a Comment