Friday 21 March 2014

జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం...

మీరు ఒక సంబంధాన్ని కోల్పోయి మనసు విరిగి ఉంటే, మిమ్మల్ని ప్రేమించని వారిని మీరు ప్రేమించకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుంటే అవి
మిమ్మల్ని ముందుకు నడిపించడానికి సహాయపడతాయి. మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడటం లేదు అని చెప్పడం జీవితంలో అత్యంత బాధాకరమైన ఒక సమయం. ఈ కఠినమైన విషయం మిమ్మల్ని పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేస్తుంది లేదా అతను మిమ్మల్ని ఇష్టపడటం లేదని ఎంతోకాలంగా గ్రహించి ఉండవచ్చు. అతని నిర్ణయాన్ని మీరు అంగీకరించి మిమ్మల్ని ఇష్టపడని వ్యక్తిని మీరు ఇష్టపడకుండా ఉండడం ఎలాగో కొన్ని చిట్కాలను తెలుసుకుని భవిష్యత్తులో ముందుకు వెళ్ళడం మంచిది.

ఈ సమయంలో, మీ హృదయం, మీ మనసు ఒకదానితో ఒకటి పూర్తిగా యుద్ధం చేసుకుంటాయి. ఇప్పటికీ మీరు అతనిని ప్రేమిస్తూ ఉంటే, మీ హృదయం తిరిగి ఆ దారిలో వెళ్లి అతనిని ఒప్పించడానికి ప్రయత్నించి ఆ బంధంలోని సంతోషకర సంఘటనలను గుర్తుచేసుకుంటారు. మరోవైపు, మీ మనసు అతని భావాలూ మారాయి అని గ్రహించడానికి ప్రయత్నించినపుడు మీరు ఏమీ చేయలేరు. మీ హృదయం, మీ మనసు ఈ నిజాన్నిఅంగీకరించి, ఒక నిర్ధారణకు రావడానికి కొంత సమయం పడుతుంది. మిమ్మల్ని ప్రేమించని వ్యక్తిని మీరు ప్రేమించకుండా ఉండడానికి మీకైమీరు కొంత సమయాన్ని ఇవ్వడం ఉత్తమమైన చిట్కాలలో ఒకటి. 


No comments:

Post a Comment