Friday 14 March 2014

పచ్చి బొప్పాయలోని హెల్త్ బెనిఫిట్స్

బొప్పాయి, మనందరకి తెలిసినటువంటి ఒక ఫ్రూట్. దీన్ని ‘ఏంజిల్స్ ఫ్రూట్' అని కూడా పిలుస్తారు. ఈ ఫ్రూట్ కు పురాతన కాలం నుండి ఒక గొప్ప ఔషధ చరిత్ర ఉంది. ఈ రుచికరమైన పండులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మరియు మినిరల్స్ మరియు అధిక పోషక ప్రయోజనాలను సమృద్ధిగా అందిస్తుంది. బొప్పాయి పండులోనే కాదు, బొప్పాయ కాయలో కూడా అనేక పోషకాంశలున్నాయి. అందుకే పచ్చిబొప్పాయను కూడా మార్కెట్లో విరివిగా అమ్ముతుంటారు. పచ్చిబొప్పాయ గ్రీన్ కలర్ లో ఉంటుంది. లోపల తెల్లగా ఉంటుంది. పండిన బొప్పాయి కంటే, పచ్చిబొప్పాయి అంతగా పాపులర్ కాలేదు. ఎందుకంటే పండిన బొప్పాయి పండు రుచి అద్భుతంగా ఉంటుంది. మరియు త్వరగా జీర్ణం అవుతుంది. తినడానికి కూడా మెత్తగా ఉంటుంది. అదే గ్రీన్ కలర్ లో ఉండే పచ్చిబొప్పాయిని తినడం కూడా కొంచెం కష్టమే. దీన్ని ఉడికించి తినాల్సి ఉంటుంది. మరియు టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.

మరో ఆసక్తికరమైన విషయమేటిటంటే గ్రీన్ బొప్పాయిలో కూడా ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఎందుకంటే, పచ్చిబొప్పాయిలో, విటమిన్స్, ఎంజైమ్స్ మరియు పాలిన్యూట్రీయంట్స్ కలిగి ఉన్నాయి. అంతే కాదు, ఇందులో అవసరం అయ్యే న్యూట్రియంట్స్ మరియు మినిరల్స్ పొటాషియం, మెగ్నీషియం, విటమిన్స్ ఎ,బి, సి మరియు ఇ లు కలిగి ఉన్నాయి. పచ్చిబొప్పాయిలో వీటితో పాటు అధిక ఎంజైమ్స్ పెపిన్ మరియు కీమోపెపిన్ అనేవి పొట్ట ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చిబొప్పాయి ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తుంది. ఉదాహరణకు, గ్రీన్ పపాయ జీర్ణక్రియను మెరుగుపరుపరుస్తుంది. ప్రోటీనులను అమినోఆసిడ్స్ గా మార్చుతుంది. కోలన్ శుభ్రం చేస్తుంది. వికారం మరియు మలబద్దకంను మరికొన్నివ్యాధులను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గ్రీన్ బొప్పాయి చాలా మేలు చేస్తుంది. అంతే కాదు, పచ్చిబొప్పాయిలోని మరికొన్ని ఆరోగ్యప్రయోజనాలు మీకోసం..

No comments:

Post a Comment