Tuesday 25 March 2014

'సింగ్లీష్` సునో

సింగపూర్‌ను స్థానికుల భాషలో సింగపుర అంటారు. సింగపురలో సింగ అంటే సింహము. పుర అంటే పురము. అలా రెండు పదాల కలయిక ఈ పేరు. చరిత్రలోకి
తొంగి చూస్తే 14వ శతాబ్దపు సుమత్ర ద్వీప యువరాజు ఈ ద్వీపాన్ని సందర్శించినప్పుడు సింహము తల వలె ఉన్న ఒక వింత జంతువు కనిపించిందట! దీంతో ఈ ద్వీపానికి ఆయన ఆ పేరు పెట్టాడని చెప్తారు. అయితే ఈ ప్రాంతంలో సింహాలు నివసించిన దాఖలాలేవీ లేవని పరిశోధకులు అంటున్నారు. అయితే రాజకుమారుడు చూసిన మృగము పులి అయి ఉండవచ్చని వారంటున్నారు. మొదట్లో ఈ ద్వీపాన్ని 'తెమసెక్‌' (సముద్రపురం) అనే జపనీస్‌ నామంతో వ్యవహరించేవారట! ఇలా పేరులోనే ఎన్నో ట్విస్ట్‌లతో ఏర్పడిన సింగపూర్‌, టూరిజంలో 'సింహ' భాగంలోనే ఉందని చెప్పుకోవాలి. కళ్లు మిరమిట్లు గొలిపే లైటింగ్‌తో, ఆకాశంతో పోటీపడే భవనాలతో, ఆధునిక సాంకేతికతను అణువణువున సింగారించుకుని దేదీప్యమానంగా వెలిగిపోతున్న అందమైన దేశం సింగపూర్‌.
           మలేసియాకు దక్షిణాన 704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన దక్షిణాసియాలోని అతి చిన్న దేశం సింగపూర్‌. దీని అధికారిక నామం 'రిపబ్లిక్‌ ఆఫ్‌ సింగపూర్‌'. ఇది ఒక చిన్న ద్వీపం. నగరం కూడానూ. పారిశుధ్యంలో 'క్లీన్‌ సిటీ'గా పేరు సంపాదించినది సింగపూర్‌. అతి చిన్నదైనప్పటికీ, ప్రపంచ దేశాలలో ఆర్థికంగా 13వ స్థానంలో ఉంది.
వ్యాపారపరంగానూ, ఆర్థికపరంగానూ అభివృద్ధి చెందిన సింగపూర్‌లో ఇటీవలే 'కాసినోవా' అనే విదేశీ సంస్కృతిని ప్రతిబింబించే క్లబ్‌ను నిర్మించటంతో ధనవంతులైన వ్యాపారవేత్తలను ఇది బాగా ఆకర్షిస్తోంది. అంతేగాకుండా చక్కటి పర్యాటక కేంద్రమైన ఈ దేశంలో వివిధ దేశాల వారు ఎక్కువగా స్థిరపడటంతో విభిన్న సంస్కృతులకు మేలు కలయికగా మారింది. పర్యాటకంగానే కాక, విలాసాలకు, వినోదాలకు పెట్టింది పేరు సింగపూర్‌.
ఆరోగ్యపరంగానూ సింగపూర్‌ అభివృద్ధి పథంలో ఉండటంతో విదేశీయులు సైతం వైద్యం కోసం ఇక్కడకు వస్తూ ఉంటారు. ఈ దేశ ఆర్థిక వనరులలో పర్యాటక రంగం ప్రధానపాత్ర వహిస్తోంది. కనుక ఇక్కడకు విచ్చేసే పర్యాటకులకు విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసా మంజూరు చేసే ఏర్పాటు ఉంది. ఈ దేశానికి వివిధ దేశాల నుండి టూరిస్ట్‌ వీసా సులువుగానే లభిస్తుంది.
ఇక్కడ చూడవలసిన పర్యాటక ప్రాంతాలలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది 'అండర్‌ సీ వరల్డ్‌'. భూగర్భంలో ఏర్పాటు చేసిన ఈ అండర్‌ సీ వరల్డ్‌లో అనేక సముద్ర ప్రాణుల్ని సజీవంగా చూసే ఏర్పాటు ఉంటుంది. ఇక్కడ రాత్రివేళల్లో అద్భుతమైన లేజర్‌ షోలు జరుగుతూ ఉంటాయి.
ప్రత్యేక వాతావరణం..
 సింగపూర్‌ ఏడాదంతా మారని పగటి, రాత్రి కాలాలున్న ప్రత్యేక దేశం. దాదాపుగా ఒకే రకమైన శీతోష్ణస్థితి, విస్తారమైన వర్షాలు ఉన్న దేశం. దీనికి కారణం ఈ ప్రాంతం భూమధ్య రేఖకు సమీపంలో ఉండటమే. గాలిలో తేమ 90 శాతం ఉంటుంది. వరసగా వర్షాలు పడితే మాత్రం ఇది నూరు శాతానికి చేరుతుంది. వర్షాలు ఏ సమయంలోనైనా రావడం ఇక్కడ అత్యంత సహజం. అందుకే ఇక్కడి ప్రజలు గొడుగును ఎప్పుడూ వెంటే ఉంచుకుంటారు. విరివిగా వాడాలి కాబట్టి ఇక్కడ గొడుగులు అందుకు తగ్గట్టు దృఢంగానూ ఆకర్షణీయంగానూ తయారుచేస్తారు. నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో పొరుగు దేశమైన ఇండొనేసియా పొదల్లో వచ్చే మంటల కారణంగా ఏర్పడే వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభుత్వం ఆరోగ్య హెచ్చరికల్ని జారీ చేస్తుంటుంది. జూన్‌, జులై నెలలు ఎండాకాలం.
సంస్కృతి..
సింగపూర్‌లో పూర్వీకులైన మలరు ప్రజలు, మూడవ తరానికి చేరుకున్న చైనీయులు, భారతీయులు, అరేబియన్లు, యూరోపియన్లు నివసిస్తున్న కారణంగా ఈ దేశం మిశ్రమ సంప్రదాయలు కలిగి ఉంటుంది. మత, కులాంతర వివాహాలు ఇక్కడ సహజం. వివిధ మతాల ఆలయాలు వీరి మిశ్రమ మత సంప్రదాయాలకు ప్రతీకలు. ఇక్కడి హోటళ్ళు మిశ్రమ రుచులకు, అభిరుచులకు అద్దంపట్టేవిగా ఉంటాయి.
మతం..
జనాభాలో 51 శాతం ప్రజలు బౌద్ధ మతం, థారు మతం అవలంబిస్తారు. చైనా, భారత్‌, యూరోపియన్‌ సంతతికి చెందిన 15 శాతం మంది క్రిస్టియన్లు, 14 శాతం మంది ముస్లింలు ఇక్కడ ఉన్నారు. ముస్లింలలో అధిక శాతం భారతీయ ముస్లింలు. స్వల్ప సంఖ్యలో సిక్కులు, హిందువులు, బహారు విశ్వాసమున్న వారు ఉన్నారు. 15 శాతం మంది ఏ మతాన్నీ అవలంబించని వారూ ఉన్నారు. వీరు కాకుండా, ఇక్కడ పౌరసత్వం లేకుండా ఇతర దేశాల నుండి వచ్చి పనిచేసే వారూ ఉన్నారు.
భాష తమాషా..
       హోదాను పొందింది. వివిధ భాషల వారు నివసిస్తుండడం వల్ల అందరికీ అనుసంధాన భాషగా ఇంగ్లీషు ప్రాచుర్యం పొందింది. అయితే ఇక్కడ ప్రజల మాతృభాషలతో కలగలసిన 'సింగ్లీష్‌' వీరి సొంతం. 'సింగ్లీష్‌' అంటే చైనీస్‌, మలరు, ఇండియన్‌ తదితర భాషల సాంకర్యంతో ఏర్పడిన ఇంగ్లీష్‌. ప్రభుత్వం మాత్రం ఈ 'సింగ్లీష్‌'ను తగ్గించి, మంచి ఇంగ్లీష్‌ మాట్లాడమని ప్రజలకు హితవు చెప్తోంది.
చూడదగ్గ ప్రదేశాలివే..
     మొదటిది, సింగపూర్‌ రేవు నుండి క్రూయిజ్‌లలో సగం రోజు పర్యటించవచ్చు. రెండు, మూడు రోజులు పడవ ప్రయాణం చేయవచ్చు. సింగపూర్‌లో భాగమైన ఇతర దీవుల్నీ సందర్శించవచ్చు. అలాగే, సముద్రతీరంలో డాల్ఫిన్‌ షోలనూ వీక్షించవచ్చు.
రెండవది, నైట్‌ సఫారీ. ఇందులో రాత్రివేళల్లో జంతు ప్రదర్శనశాల చూసే ఏర్పాటు ఉంది. ఇక్కడ ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఉంటాయి. రాత్రివేళల్లో జంతువులను వాటి సహజ పరిస్థితులలో చూడటం పర్యాటకులకు ఓ వింత అనుభూతిని కలిగిస్తుంది. పగటివేళల్లో కూడా జంతు ప్రదర్శనశాలను చూసే ఏర్పాటు ఉంది.
మూడవది, పక్షుల పార్క్‌. ఇక్కడ పక్షుల చేత రకరకాల విన్యాసాలు చేయిస్తారు. అత్యంత అపురూపమైన లేత కాషాయపు రంగు హంసలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. పార్కు మొత్తం చుట్టి చూడటానికి చక్కని రైలు సౌకర్యం ఉంది. స్కై టవర్లో సందర్శకులను టవర్‌ పైభాగానికి తీసుకువెళ్ళి కిందకు దించుతారు. పై నుంచి సింగపూర్‌నే కాక ఇండొనేసియా, మలేసియాలను కూడా చూడగలగటం ఒక అద్భుతమైన అనుభవం.
నాల్గవది, సెంటోసా ద్వీపం. ఈ ద్వీపానికి కేబుల్‌ కారులో ఒక దారిలో వెళ్ళవచ్చు. తిరిగి రావడానికి బస్సు రూటును ఉపయోగించుకుంటారు. సింగపూరులో భాగమైన సెంటోసా ద్వీపంలో సింగపూరు జాతీయ చిహ్నమైన మెర్‌ మెయిడ్‌ కింద భాగం చేప ఆకారంతో, పై సగ భాగం సింహం ఆకారంతో ఉంటుంది. ఈ మెర్‌ మెయిడ్‌ను చూడటం మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది.
సందర్శకులను మెర్‌ మెయిడ్‌ తల భాగము (చేప ఆకారం) వరకూ లిఫ్ట్‌లో తీసుకువెళతారు. ముందుగా ఒక చిన్న ప్రదర్శన ఉంటుంది. సింగపూర్‌ చరిత్రను లేజర్‌ షో సహాయంతో ప్రదర్శిస్తారు. జీవం ఉట్టిపడే బొమ్మలతో నావ ప్రయాణాన్ని, అనేక సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనశాలను మనం వీక్షించవచ్చు.
లిటిల్‌ ఇండియా, చైనా టౌన్‌, సెరంగూన్‌ రోడ్‌లు సింగపూర్‌లో చూడవలసిన వాటిలో ప్రధానమైనవి. పండుగ సమయాలలో ఈ వీధులన్నీ చూడముచ్చటగా అలంకరిస్తారు. విదేశీయులు ఇక్కడ ముస్తాఫా, సన్‌టెక్‌లలో కావలసిన వస్తువుల్ని కొనుక్కోవచ్చు. సన్‌టెక్‌ నిర్మాణాన్ని ఇక్కడి ప్రజలు గొప్పగా వర్ణిస్తుంటారు. ఇక్కడి భోజనశాలల్లో రుచికరమైన భారతీయ భోజనం లభిస్తుంది.
ఈ టూర్‌ ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా సాగుతుంది. అయితే ఖర్చు మాత్రం కొంచెం ఎక్కువే అవుతుంది.

సింగపూర్‌ జాతీయ భాష మలరు. జాతీయ గీతం మజులా సింగపుర. అధికార భాషలు మలరు, మాండరిన్‌, ఇంగ్లీష్‌, తమిళం. స్వాతంత్య్రానంతరం ఇంగ్లీషు అధికారిక

No comments:

Post a Comment