Wednesday 8 January 2014

10టాప్ టిప్స్ : వింటర్ స్కిన్ కేర్

శీతాకాలంలో చల్లనిగాలులు ఆహ్లాదంగా చలికాలపు వాతావరణం చర్మం మీద ప్రసరించి చర్మ సౌందర్యానికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పెదవులు, ముఖం, చేతులు, పాదాల మీద చలిగాలి ప్రభావం తీవ్రంగా వుంటుంది. చర్మం పొడారిపోయినట్లు అవటమేకాక, దురద కూడా వుంటుంది. పెదాలు పగులు తాయి. ముఖం మీద చెమటపొక్కులు ఏర్పడతాయి. పాదాల చివర పగుళ్లు వస్తాయి. చర్మానికి ఏర్పడే యిటువంటి మార్పుల వల్ల చర్మపు సౌందర్యానికి అవరోధం కలిగి చర్మం బిరుసెక్కి ముఖం అందవికారంగా కనిపిస్తుంది. అయితే శీతాకాలమంతా అందవికారంగా వుండక తప్పదా అని బాధపడవలసిన అవసరం లేదు. చలికాలంలో చర్మాన్ని సంరక్షించేం దుకు చర్మసౌందర్యాన్ని కాపాడేందుకు మార్కెట్లో ఎన్నెన్నో సౌందర్య సాధనాలు లభిస్తున్నాయి. వాటి నుపయోగించి వాతావరణ ప్రభావం చర్మంమీద ప్రసరించ కుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. శీతాకాలములో చర్మ సంరక్షణ చాలా ముఖ్యము . ఒక్కొక్క కాలములో ఒక్కక్క రీతిలో మన చర్మాన్ని రక్షించుకుంటూ ఉండాలి . కాలానుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి . ఎండకాలములో ఒకరకమైన జాగ్రతాలు , వర్షాకాలములో వేరేవిధమైన చిట్కాలు.. శీతాకాలములో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవలసిన అవసరము ఉంటుంది . చలికాలమనేది చర్మ సంరక్షణ కు అధికప్రాధాన్యత ఇవ్వవలసిన కాలము . ప్రత్యేకించి ముఖ సౌందర్యాన్ని కాపాడుకోడానికి తగినంత సమయము వెచ్చించ వలసిన కాలమిది . ముఖానికి మాయిశ్చరైజర్ వాడాలి . డ్రై స్కిన్‌ ఉన్నవారు మరింత జాగ్రత్తగా మెలగాలి . చలి కాలం వచ్చేస్తోందంటే మహిళలు అన్నింటికంటే ముందుగా పొడిబారిపోయే చర్మం గురించే భయపడుతుంటారు. గాలిలో తేమ చలికాలంలో బాగా తగ్గిపోతుంది కాబట్టి చర్మం కూడా ఈ సీజన్‌లో పొడిబారిపోతూ ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి అంత ప్రమాదం లేదు కాని పొడి చర్మం కలవారు.. సాదా చర్మం కలవారు చలికాలంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవలసిందే మరి. స్నానం చేయడం, రాత్రిపూట చలిపులి నుంచి చర్మాన్ని ముఖ్యంగా పెదవులను కాపాడుకోవడం, శిరోజాల నిగనిగలు తగ్గిపోకుండా జాగ్రత్తపడటం, సరైన ఆహారం తీసుకోవడం... ఇలా చలికాలం మహిళల చర్మసౌందర్యానికి అన్నీ సమస్యలే మరి.

No comments:

Post a Comment