Thursday 2 January 2014

టమోటో జ్యూస్ తో అందాన్ని రెట్టింపు చేసుకోండి

శీతాకాలంలో, చర్మం పొడిగా మారడం సహం, ఈ పొడి చర్మం నివారించుకోవడానికి మాయిశ్చరైజర్ లేదా నూనె వంటి ముఖానికి అప్లై చేస్తుంటా, ఇది చాలా ఆయిల్ గా లేదా జిడ్డుగా మారుతుంది. చాలా మంది నేచురల్ గానే ఆయిల్ స్కిన్ కలిగి ఉంటారు. అటువంటి వారు, ఇటువంటి ఆయిల్ ప్రొడక్ట్స్ అప్లై చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితి కంటే మరింత వరస్ట్ గా మార్చుతుంది. అందువల్ల ఆయిల్ స్కిన్ నేచురల్ గా తగ్గించుకోవడానికి, కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించాలి. ఆయిల్ స్కిన్ నివారించడానికి చాలా నేచురల్ పదార్థాలున్నాయి. ఉదాహరణకు టమోటో ఒక ఉత్తమ నేచురల్ పదార్థం. ఇది మనం విరివిగా ఉపయోగించే ఒక వంటగది వస్తువు. వంటకు ఉపయోగించడం మాత్రమే కాకుండా, టమోటోలో బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అనేక హోం మేడ్ ఫేస్ ప్యాక్ కోసం, టమోటోలను ఉపయోగిస్తుంటారు. టమోటో ఒక నేచురల్ ఆస్ట్రిజెంట్, ఇది చర్మ రంధ్రాలను శుభ్రం చేయడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా టమోటోల్లో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ చర్మం యవ్వనంగా మరియు దీర్ఘకాలం ఫ్రెష్ గా ఉండేందుకు సహాయపడుతుంది. టమోటోలను పేస్ట్ లా తయారుచేసి, నేరుగా చర్మానికి అప్లై చేయవయచ్చు. ఇది టమోటోలు మాత్రమే కాదు, టమోటో జ్యూస్ కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది. పెద్దగా ఉన్న చర్మ రంధ్రాలను కూడా నివారించడానికి టమోటో జ్యూస్ ను అప్లై చేయవచ్చు. ఇది మొటిమలను మరియు డార్క్ స్పాట్స్ ను తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా, ఆయిల్ స్కిన్ నివారించడానికి ఇది ఒక బెస్ట్ నేచురల్ రెమెడీ. మరి అవేంటో ఒక సారి చూద్దాం...

No comments:

Post a Comment