Friday 31 January 2014

అధిక కొవ్వు, ఊబకాయం, భవిష్యత్తులో రాబోయే జబ్బుల రిస్క్‌...

అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ అండ్‌ అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ వారు గుండెజబ్బుల నుండి కాపాడుకోవడానికి కొన్ని
నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. అధిక కొవ్వు, ఊబకాయం, భవిష్యత్తులో రాబోయే జబ్బుల రిస్క్‌, ఆరోగ్యకరమైన జీవనశైలి, వీటన్నింటి ఆధారంగా వీరు మార్గదర్శక నియమాలను ఏర్పరిచారు. మొత్తం మీద ఈ కొత్త నిబంధనల సారాంశం ఒక్కటే. అది ఏమిటంటే, కొవ్వును తగ్గించడానికి స్టాటిన్‌ అనే మందును వాడడం!
ఏ ప్రమాణాలకు లోబడి
ఈ మందు ఇవ్వాలి?
రోగికి భవిష్యత్తులో హార్ట్‌ ఎటాక్‌లు వచ్చే రిస్క్‌ ఏ మాత్రం ఉంది అన్నది దృష్టిలో ఉంచుకుని ఇవ్వాలి కాని, ఎల్‌ డి ఎల్‌ కొలెస్ట్రాల్‌ (చెడు కొలెస్ట్రాల్‌) రీడింగ్‌ని బట్టి కాదు. మామూలుగా అయితే ఎల్‌ డి ఎల్‌ రీడింగ్‌ 100 మిల్లీ గ్రాముల కన్నా తక్కువ ఉండాలి. అదే 160 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్‌ రీడింగ్‌ ఉంటే చాలా ఎక్కువగా భావించాలి. అటువంటప్పుడు చాలా ఎక్కువ స్థాయిలో స్టాటిన్‌ చికిత్సను సూచిస్తారు.
ఎవరికి స్టాటిన్‌ చికిత్స చేయాలి?
న అంతకు ముందు హార్ట్‌ ఎటాక్‌, లేక స్ట్రోక్‌ వచ్చిన వారు కాని, గుండెజబ్బు స్టేబుల్‌గా కాని, అన్‌స్టేబుల్‌గా కాని ఉన్నవారు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి (పెరిఫెరల్‌ ఆర్టెరీ డిసీజ్‌), రక్త ప్రవాహం తగ్గడం వల్ల బ్రెయిన్‌కి వచ్చే ఎటాక్‌ (ట్రాన్సియెంట్‌ ఇస్కీమిక్‌ ఎటాక్‌ ) లేక కోరోనరీ లేక ఇతర ఆర్టెరియల్‌ రీవాస్క్యుకలరైజేషన్‌ కలిగి ఉన్న వారికి ఈ మందు ఇవ్వాలి.
న 40 నుండి 75 ఏళ్ళ వయస్సు వారు 10 ఏళ్ళ లోపు 7.7 శాతం హార్ట్‌ ఎటాక్‌ గాని, స్ట్రోక్‌ గాని వచ్చే రిస్క్‌ని కలిగి ఉన్నారన్న అంచనాకి వస్తే, వారికి స్టాటిన్‌ ఇవ్వాలని నిపుణుల సూచన.
న చాలా ఎక్కువ చెడు కొవ్వు కలిగి ఉన్న 21 ఏళ్ళ వ్యక్తులకు ఇవ్వాలి..
న 40 నుండి 75 ఏళ్ళ వయస్సు కలిగి, టైప్‌ వన్‌ లేక 2 డయాబెటిస్‌ కలిగి ఉన్న వారికీ ఈ చికిత్స అవసరం.
అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ సూచనలు
ఊబకాయాన్ని చాలా పెద్ద జబ్బుగా గుర్తించాలి. వైద్య నిపుణులు కనుక బరువు తగ్గించుకోమని సలహా ఇస్తే తప్పక బరువు తగ్గాలి. ముందస్తు చర్యగా, ఊబకాయం కలిగి ఉన్నారా లేదా అనే పరీక్ష చేయించుకోవాలి.
ఇంకా బిహేవియరల్‌ థెరపీ తీసుకోవాలి. ఇవి రెండూ తప్పనిసరిగా చేయాలి.
శరీరానికి ఎంత కావాలో అన్ని క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వ్యాయామం ఎక్కువగా చేయాలి. చెడు అలవాట్లు ఉంటే మానేసి, ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలి. మొత్తం మీద శరీరం ఎంత బరువు ఉండాలో అంత బరువు మాత్రమే కలిగి ఉండేలా నిర్వహించుకోవాలి.అంతేకాదు, ఈ ఆరోగ్య నిబంధనలు, ఒక రోగి 10 ఏళ్ళలో గుండెజబ్బులు వచ్చే రిస్క్‌ను కలిగి ఉన్నాడా లేదా అంచనా వేయడానికి కొన్ని టూల్స్‌ను కూడా ఇచ్చాయి. అవేంటంటే, లింగబేధం, వయస్సు, మొత్తం కొలెస్ట్రాల్‌ రీడింగ్‌, హెచ్‌ డీ ఎల్‌, మంచి కొలెస్ట్రాల్‌, రక్తపోటు, రక్తపోటుకు వాడే మందులు, డయాబెటిస్‌ ఏ స్థాయిలో ఉంది, పొగ పీల్చే అలవాటు ఏ స్థాయిలో ఉంది అన్న దాన్ని బట్టి అంచనా వేస్తారు.అలాగే, గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహారం తీసుకోవాలని సూచిస్తు న్నారు. పండ్లు, కూరగాయలు, గింజ ధాన్యాలు, తక్కువ కొవ్వు ఉన్న డైరీ ఉత్పత్తులు, చేపలు, నట్స్‌ తినమని సలహా ఇస్తున్నారు. రెడ్‌ మీట్‌, తీపి పదా ర్థాలు, కూల్‌ డ్రింక్స్‌ ఇంకా సోడి యమ్‌ వంటివి పరిమితికి లోబడి తీసుకోవాలి. కనీసం వారానికి నాలుగు రోజులు నలభై నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచన చేస్తున్నారు.

No comments:

Post a Comment