Thursday 30 January 2014

తినేఆహారంతో తగ్గే ఒత్తిడి

అధిక రక్తపోటు... మధుమేహం... పక్షవాతం... స్ధూలకాయం... పొగతాగడం... సోమరితనం... ఉప్పు ఎక్కువగా తీసుకోవడం...దీర్ఘకాలిక ఒత్తిడులు..
. నిద్ర పట్టకపోవడం... లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వీటి తగ్గుదల కోసం కొన్ని ఆహార చిట్కాలు పాటించి చూడండి.!
ణ బిపి 110-70 ఉంటుందా? అయితే ప్రతిరోజూ ఆహారంలో గుడ్డులోని తెల్లని భాగాన్ని చేర్చుకోండి. దీనివల్ల రక్తపోటు తగ్గుతుంది. అంతేకాక, అది ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.
ణ వృక్ష సంబంధమైన ఆహారంలో ఉండే ప్రోటీన్లు లభించే బ్రొకోలి, బీన్స్‌, బ్రౌన్‌రైస్‌, ఓట్‌మీల్‌ లాంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్లను అందించగలుగుతాం.
ణ సోయా ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళాల పనితీరును మెరుగు పరచడంతో పాటు శరీరంలోని సోడియం స్థాయిల్ని సమతుల్యం చేస్తుంది.
- వారంలో రెండు, మూడుసార్లు ఆహారంలో ఆకుకూరల్ని చేర్చడంతో క్యాల్షియం, పీచు పదార్థాలు కావాల్సినంత అందుతాయి.
- రక్తనాళాల వాపు తగ్గించడానికి, చురుకు దనాన్ని పెంచడానికి చాక్లెట్‌లు ఎంతో ఉపయోగపడతాయి. అలాగని ఎక్కువగా తీసుకోకూడదు. 30 కేలరీల శక్తినిచ్చే వరకూ తీసుకోవచ్చు. దీనితో పాటు నిత్యం వాడే మాత్రలను మరచిపోకండి.
- వీటన్నింటినీ పాటిస్తూనే రోజూ 30 నిమిషాల నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది.
- శాచ్యురేటెడ్‌ కొవ్వులు, చక్కెర, చక్కెర సిరప్‌లను, 100 శాతం తృణధాన్యాలను ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తపోటు, ఒత్తిడుల నుంచి దూరంగా ఉండవచ్చు.

No comments:

Post a Comment