Monday 20 January 2014

షేజ్వాన్ ఫ్రైడ్ రైస్: ఇండో చైనీస్ రిసిపి

ఈ రైస్ రిసిపి ఒక ఇండో చైనీస్ రిసిపి. ఈ వంటను మన ఇండియన్స్ అందరూ చాలా ఇష్టపడుతారు. కొంచెం స్పైసీగా ఉండే ఈ స్పెషల్ రైస్ రిసిపిని అలాగే తినవచ్చే లేదా మీకు నచ్చిన మంచూరియన్ గ్రేవీతో కలిపి తినవచ్చు. ఈ ఇండో చైనీస్ వంటకు స్పెషల్ టేస్ట్ సెలరీ ద్వారా అందుతుంది . ఇది ఒక అద్భుతమైన ఆరోమా సువాసను కలిగిస్తుంది . మీకు అందుబాటులో సెలరీ లేకపోతే, మీరు కొత్తిమీర తరుగును ఉపయోగించుకోవచ్చు. మరి ఈ స్పెషల్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్ధాలు: 
ఎండు మిర్చి: 10-12 (మీరు తక్కువ కారం తినేట్లైతే తక్కువగా ఉపయోగించండి) వెల్లుల్లి: 8-10 లవంగాల ఆయిల్: 1tsp సెలరీ(ఆకుకూరలు): 2tbsp(సన్నగా తరిగాలి) బ్రౌన్ షుగర్: 1tbsp ఉల్లికాడలు(స్ప్రింగ్ ఆనియన్స్): 1tbsp మరియు గార్నిషింగ్ కోసం వినెగార్: 1tbsp టమోటా కెచప్: 1tbsp MSG:¼ tsp ఉప్పు: రుచికి సరిపడా మొక్కజొన్న పిండి: ½tbsp నీళ్ళు: 1cup నువ్వులు నూనె: 1tbsp అల్లం: ఒక చిన్న ముక్క (తురిమిన) మిక్స్డ్ కూరగాయలు: 1cup(క్యారెట్లు, బొంత మిరప, బ్రోకలీ మరియు క్యాబేజీ) వండిన అన్నం: 2cups 
 తయారుచేయు విధానం: 
1. ముందుగా ఎండుమిర్చి మరియు గార్లిక్ ను నీళ్ళలో వేసి 20నిముషాలు నానబెట్టుకోవాలి. 
2. తర్వాత నీళ్ళను వంపేయాలి. 
3. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 
4. ఇప్పుడు పాన్ లో నువ్వుల నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. 
5. తర్వాత అందులో సెలరీ, బ్రౌన్ షుగర్, స్ర్పింగ్ ఆనియన్, వెనిగర్, టమోటో కెచప్, ఎంఎస్ జి మరియు ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి. 
6.ఇప్పుడు ఒక కప్పు నీటిలో కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసి వేగుతున్న మిశ్రమంలో వేయాలి. 
7. ఈ సాస్ పూరన్తిగా ఉడికి చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి. 
8. తర్వాత మరో పాన్ లో కొద్దిగా నువ్వుల నూనె వేసి వేడయ్యాక అందులో కట్ చేసి పెట్టుకొన్న అన్ని రకాల వెజిటేబుల్స్ ముక్కలు వేసి మరో నిముషం వేయించుకోవాలి. 
9. ఇప్పుడు అందులో ముందుగా వండి పెట్టుకొన్నఅన్నం మరియు షేజ్వాన్ సాస్ వేసి బాగా మిక్స్ చేయాలి. (మీకు ఎంత మేరకు కారం అవసరం అవుతుందో అంత సాస్ ను ఉపయోగించుకోవచ్చు) 
10. అన్నం, సాస్ మొత్తం మిశ్రమాన్ని 2,3నిముషాలు బాగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. 
11. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును జోడించాలి.
12. తర్వాత చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ (ఉల్లికాడల ముక్కల)తో గార్నిష్ చేసుకోవాలి. అంతే వేడి వేడిగా సర్వ్ చేయాలి.

No comments:

Post a Comment