Sunday 26 January 2014

పాత్రలకు అంటిన ఎగ్ స్మెల్ నివారించే ...

రోజులో ఏ సమయంలోనైన గుడ్లు కలిగి ఉండటం మంచి ఆలోచన. వాటిని వండటానికి ఎక్కువ కృషి అవసరం లేదు. వాటిని బాయిల్డ్ లేదా గిలకొట్టి బ్రెడ్ తో పాటు కలిపి తీసుకోవచ్చు. దీనిని తయారుచేయటం చాలా సులభం. అలాగే ఇది తినటానికి కూడా చాలా బాగుంటుంది. అంతేకాక మీ ఆకలిని బాగా తీర్చుతుంది. అయితే మీరు వాటిని వండడానికి ఉపయోగించే పాత్రల వాసన తొలగించటం గురించి ఆలోచిస్తున్నారా? మీకు వండటానికి కన్నా,వండిన పాత్రలను శుభ్రం చేయటానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే, పాత్రల నుండి గుడ్డు వాసన తొలగించడానికి మార్గాలు ఉన్నాయి. కొన్ని ప్రాథమిక పదార్థాలను ఉపయోగించడం ద్వారా పాత్రల గుడ్డు వాసనను తొలగించవచ్చు.
 
శనగపిండి పద్ధతి
మీరు గుడ్డు తినడం పూర్తి చేసిన తర్వాత,మీ పాత్రలలో గుడ్డు వాసన అలాగే ఉండిపోతుంది. కాబట్టి, తరువాత ఏమి చేయాలి? సరే,కొంత శనగపిండి తీసుకొని పాత్రను రుద్దాలి. ఆ పాత్రను కొంత సమయం అలా ఉంచిన తర్వాత శుభ్రం చేయాలి. అప్పుడు మీ పాత్ర యొక్క వాసన తగ్గటం గమనించవచ్చు.
 
నిమ్మరసం ట్రీట్మెంట్
గుడ్లు వండే పాత్రలో కోడిగుడ్డు వాసన ఉంచవచ్చు. గుడ్డు వాసన పాత్రల నుండి ఎలా వదిలించుకోవటం? దీనికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది. మీరు పాత్రలను శుభ్రం చేయటానికి స్వచ్ఛమైన నిమ్మరసంను ఉపయోగించవచ్చు. మీరు నేరుగా నిమ్మరసంను ఉపయోగించాలని అనుకుంటే,అప్పుడు మీరు నిమ్మరసంలో వస్త్రం యొక్క భాగాన్ని ముంచి,దానితో పాత్రలను రుద్దాలి. తర్వాత వాటిని శుభ్రం చేస్తే గుడ్డు వాసన ఉండదు. నిజానికి,మీరు నిమ్మరసం కలిగిన ఒక లిక్విడ్ సోప్ ను కూడా కొనుగోలు చేయవచ్చు. మీ పాత్రలు గుడ్డు వాసన లేకుండా శుభ్రం చేయడానికి చాలా బాగుంటుంది.
వెనిగర్ స్ప్రే
ప్లాస్టిక్ పాత్రలలో గుడ్డు వాసన కొంత సమయం ఉంటుంది. మీరు నిజంగా ఈ గుడ్డు వాసన మీ ఇంటి అంతటా వ్యాప్తి చెందుతుందని ఆలోచిస్తున్నారా? కాబట్టి,మీరు ఆ పాత్రల మీద వెనిగర్ స్ప్రే చేసి ఆ తర్వాత కడగాలి. వెనిగర్ స్ప్రే చేసి కొంత సమయం అలా ఉంచండి. కొంత సమయం తరువాత,ఒక సున్నితమైన సబ్బుతో కడగాలి. అంతే గుడ్డు వాసన ప్లేట్లు నుండి పోతుంది.
వెనిగర్ ట్రీట్మెంట్
మీరు గుడ్డు వాసన వదిలించుకోవటం కొరకు పాత్రలను శుభ్రం చేసినప్పుడు,మొదట సాధారణ సబ్బుతో పాత్రలను కడగాలి. మీరు కడిగిన తర్వాత ఆ పాత్రలకు ఒక స్పూన్ వెనిగర్ ను రాసి,కొంత సమయం అయిన తర్వాత నీటితో కడగాలి. అప్పుడు గుడ్డు వాసన పోతుంది. అలాగే కొత్త పాత్ర వలె మంచి వాసన వస్తుంది.
బేకింగ్ సోడా పద్ధతులు
మీ ముక్కును చికాకుపరచే దారుణమైన వాసనను తొలగించడానికి ఎక్కువ లేదా తక్కువ బేకింగ్ సోడాను ఉపయోగించాలి. మీరు తయారుచేసిన బేకింగ్ సోడా ద్రావణంలో గుడ్లు వాసన వచ్చే పాత్రలను ముంచి,కొంత సమయం అయిన తర్వాత,సాధారణ సబ్బు ద్రవాలతో పాత్రలను శుభ్రం చేసి పొడిగా తుడవాలి. అప్పుడు పాత్రల నుండి గుడ్డు వాసన మాయం అవుతుంది.

No comments:

Post a Comment