Tuesday 28 January 2014

మొటిమలు మచ్చలుగా మారితే...

మొటిమలు పగిలి నల్లమచ్చలుగా ముఖంపై ఉండిపోతున్నాయి. వాటిని ఎలా నివారించుకోవాలి అనేది చాలామందిని బాధించే సమస్య.
మరి దీనికి పరిష్కారం ఏమిటి?
ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు మెడికల్‌ సబ్బులను ఉపయోగించి ముఖాన్ని కడుక్కోవాలి. తర్వాత దూదితో రెగ్యులర్‌ క్రీమును రాసుకోవాలి.
వేపాకులను నీటిలో వేసి చిన్న మంట మీద వేడిచేయాలి. చల్లారిన తరువాత దీనినిపేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును ప్రతిరోజు ముఖానికి రాసుకొని అరగంట తర్వాత కడిగేసుకోవాలి. వేప యాంటీసెప్టిక్‌గా పనిచేయడం వల్ల మొటిమలే కాక ఎలాంటి మచ్చలూ ఉండవు. కొద్దిగా దాల్చినచెక్క పొడి, కొన్ని చుక్కల నిమ్మరసం, తేనెను కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలపై మాత్రమే రాయాలి. రెండు గంటలు ఉంచుకొని కడిగేసుకోవాలి. ముల్తానీ మట్టికి రోజ్‌ వాటర్‌, నిమ్మరసం కలిపి పేస్టులా చేయాలి. దీనిని వారానికి రెండు, మూడు సార్లు ముఖానికి రాసుకోవాలి. మొటిమలు పగలడం వల్ల వచ్చే ద్రవాన్ని చేతితో తీయకుండా కూరగాయల తొక్కలు లేదా పండ్ల తొక్క లను ఉపయోగించాలి. దీనివలన ముఖంపై వేరే ప్రదేశంలో ద్రవం అంటకుండా ఉంటుంది.ఇలా జాగ్రత్తలు పాటి స్తూనే ఆహారంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి.

No comments:

Post a Comment