Saturday 18 January 2014

బ్లాక్ హెడ్స్ అంటే భయమేందుకు?

ముఖం మీద చిన్న చిన్న నల్లటి మచ్చలు..ఇవంటే అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా హాడలే. ఇది ముఖాలను అందవిహీనంగా చేయటమే కాదు..కొన్ని సార్లు మానసికంగా కూడా క్రుంగదీస్తాయి. వీటినే బ్లాక్ హెడ్స్ అంటుంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఈ బ్లాక్ హెడ్స్ ను నివారించడంలో పెద్ద కష్టమైన పనేమి కాదు. బ్లాక్ హెడ్స్ అంటే? మన చర్మం క్రింద సెబాసియస్ గ్లాండ్స్ ఉంటాయి. యుక్త వయస్సులో ఈ గ్లాండ్స్ చురుకుగా పనిచేస్తాయి. సెబమ్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల చర్మం పై ఎర్రగా లేదా నల్లగా ఉండే పింపుల్స్ ఏర్పడతాయి. నల్లగా ఉండే పింపుల్స్ ను బ్లాక్ హెడ్స్ అంటారు. ఇవి మామూలు పింపుల్స్ కన్నా పెద్దగా ఉంటాయి. ముఖంలో బ్లాక్ హెడ్స్ తొలగించే ఎఫెక్టివ్ ఫేస్ మాస్క్ కారణాలేమిటి? మన చర్మానికి అవసరమైన పోషక పదార్తాలను అందచేసే క్రమంలో రక్తం నుంచి అదనంగా ఉండే నూనె పదార్థాలు, సెబమ్ మరికొన్ని రసాయన పదార్థాలు వెలువడతాయి. ఇవి చర్మ రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. బటయ ఉండే దుమ్ము, ధూళి కూడా ఇవి ఏర్పడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా చేరుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింతగా ఉంటుంది.

No comments:

Post a Comment