Friday 7 February 2014

గ్రీన్ టీలోని టాప్ 10 హెల్త్ & బ్యూటీ బెనిఫిట్స్

పొద్దున్నే టీ కప్పు కనిపిస్తే మనిషికి ఉదయించే సూర్యుణ్ణి చూసినంత ఆనందం కలుగుతుంది. టీ మాధుర్యాన్ని చవి చూసిన ఆనందంలో కొందరు పాలు
కలపడానికి కూడా ఇష్టపడక ఏకంగా బ్లాక్ టీనే తాగడం మొదపూట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల గ్రీన్ టీ పట్ల మోజు బాగా పెరుగుతోంది. ఆరోగ్యపరమైన ఎన్నో సమస్యలకు గ్రీన్ టీ మంచి ఔషధంలా పనిచేస్తుంది. అందుకే దీన్ని తీసుకునేవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. గ్రీన్ టీలోని విశేషాలను, ఔషధ గుణాలను మరింత లోతుగా పరిశీలిస్తే.... అన్ని పానీయాల్లోకంటే అత్యంత ప్రజాదరణ పొందినది టీ. అలసిపోయినప్పుడు టీ తాగితే రిఫ్రెష్ అవుతారు. నిరాశా నిస్పృహలకు లోనైనప్పుడు మనకు ఆలంబనగా నిలిచి మానసికోల్లాసానికి మార్గంగా మారుతుంది టీ. అలాంటి ఈ టీస్థానంలో గ్రీన్‌ టీ వచ్చింది. మామూలు టీకన్నా గ్రీన్ టీ తాగితే శరీరానికి చాలా మంచిది. గ్రీన్‌ టీ తాగడం వల్ల ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి కీలకపాత్ర పోషిస్తుంది. సుదీర్ఘకాలం పాటు చెప్పుకోదగినంతగా ఆరోగ్య లాభాలు చేకూర్చిపెడుతుంది. గ్రీన్‌ టీలో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. గ్రీన్‌ టీలో ఫ్లేవనాయిడ్స్‌ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాకుండా, సాధారణంగా మామూలు టీలో ఏ మేరకు చక్కెర వాడుతున్నామనే స్పృహ మనకు ఉండదు. అదే గ్రీన్‌ టీలో అలా కాదు. అందుకే, తీసుకొనే చక్కెర మొత్తాన్ని తగ్గించాలన్నా, లావెక్కే ప్రమాదం నుంచి తప్పించుకోవాలన్నా అందుకు చక్కటి మార్గం - గ్రీన్‌ టీ. అధిక బరువుని తగ్గించడమే కాకుండా ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎన్నో అద్భుతాలు చేస్తుంది.అవి ఏంటో చుసేద్దామా:


No comments:

Post a Comment