Saturday 15 February 2014

పంజాబీ స్టైల్ చికెన్ రిసిపి

చికెన్ భున రెస్టారెంట్స్ లో తయారుచేసే ఒక పాపులర్ రిసిపి. భున అంటే (బాల్చింగ్ )నూనెలో చికెన్ వేయించడం. అయితే ఇది ఫ్రై మాత్రం కాదు .
చికెన్ భునాను మసాలా దినుసులత మరియు చికెన్ ముక్కలతో కలిపి నూనెలో వేయిస్తారు. ఈ వంట ముఖ్యంగా నార్త్ ఇండియాలోని పంజాబ్ లో చాలా ఫేమస్. ఈ చికెన్ భున రిసిపిని చాలా సులభంగా తయారుచేయవచ్చు. కేవలం ఇందులో చేర్చే మసాలా దినుసులు మరియు వాటిని ఏవిధంగా ఎప్పుడెప్పుడు జోడించాలో తెలుసుంటే చాలు. మరి ఈ సులభమైన డిఫరెంట్ టేస్ట్ కలిగిన చికెన్ భున రిసిపిని మీరు కూడా టేస్ట్ చేయాలంటే , తయారుచేసే పద్దతి తెలుసుకోవాల్సిందే...

కావల్సిన పదార్థాలు: 
వైట్ ఉల్లిపాయలు: 2 అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp పచ్చిమిర్చి :4 (తరిగినవి) చికెన్ -500 గ్రాముల (బోన్ లెస్ ) సోంపు: 1tsp జీలకర్ర: 1tsp ఏలకులు : 4 (చూర్ణం) కారం: 1tbsp కొత్తిమీర పొడి: 1tbsp టమోటో 2 (చిన్న ముక్కలుగా తరిగినవి) గరం మసాలా: 1tsp నూనె: 2tbsp ఉప్పు: రుచికి సరిపడా కొత్తిమీర : 2tbsp (తరిగినది)

తయారుచేయు విధానం: 
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకవాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి . 
2. మీడియం మంట మీద 2నిముషాలు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్ ముక్కులు వేసి, మరో 5నిముషాలు వేయించుకోవాలి. 
3. ఇప్పుడు మసాలాలన్నింటిని సోంపు, యాలకుల పొడి, జీలకర్ర వేసి మరో రెండు నిముషాలు వేయించుకోవాలి. 
4. అలాగే టమోటో ముక్కలు వేసి, ఉప్పు చిలకరించి 5 నిముషాలు వేయించుకోవాలి. 
5. 5నిముషాల తర్వాత కారం, ధనియాల పొడి మరియు గరం మసాలా వేసి మరో 5 నిముషాలు ఉడికించుకోవాలి . 
6. చికెన్ భున డ్రైగా వేగడానికి మారినప్పుడు అందులో ఒక కప్పు నీళ్ళు పోసి, చిక్కగా ఉండికించుకోవాలి. 
7. మొత్తం మిశ్రమాన్ని బాగా కలియ బెట్టి, మూత పెట్టి 10 ఉడికించుకోవాలి. 
8. చికెన్ బాగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, రైస్ లేదా రోటీలతో సర్వ్ చేయాలి. అంతే చికెన్ భున రెడీ.

No comments:

Post a Comment