Wednesday 5 February 2014

తలలో చుండ్రువంటి ఫంగస్: నివారణ చిట్కాలు

మనశరీరంలో ఏ ప్రదేశంలోనైన సరే ఫంగస్ ఏర్పడటానికి అవకాశం ఉంది. ఉదాహరణకు తలలో, పాదాల్లో, చర్మం మొదలగునవి ప్రధాన ప్రదేశాలు. ముఖ్యంగా తలలో
రింగ్ వార్మ్ అనే ఫంగస్ చాలా సాధారణంగా వచ్చే సమస్య ఇది. దీని వల్ల తల మరియు జుట్టు మీద ప్రభావం చూపుతుంది. అందువల్ల, ప్రతి రోజూ తలస్నానం చేయడం, తలఆరబెట్టుకోవడం, తగిన పోషణ అందేలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది తల, జుట్టుకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, క్లీన్ గా నీట్ గా పెట్టుకోవడం చాలా అవసరం. తడి జుట్టుతో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళకూడదు. అలా వెళ్ళినప్పడు తడిజుట్టు ఫంగస్ కు దారితీస్తుంది. ఈ ఫంగస్ కు ప్రధాన లక్షణం తలలో ఎక్కువగా దురదపెడుతుంది. తలస్నానం చేసినా కూడా సమస్య అలాగే ఉంటుంది.


No comments:

Post a Comment