Wednesday 19 February 2014

ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకొంటే పొందే గొప్ప ప్రయోజనాలు

 మనలో చాలా మంది బరువు తగ్గించే డైట్ ను అనుసరిస్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే న్యూట్రీషినల్ ఫుడ్స్ ఎంపిక చేసుకుంటుంటారు. మీరు ఫర్ ఫెక్ట్ శరీర ఆకరంను కలిగి ఉన్నప్పుడు ఇది వర్తిస్తుంది. కానీ, మీరు తీసుకొనే న్యూట్రీషియన్స్ సరిగా తీసుకోకపోతే మీరు చూడటానికి అందంగా కనబడరు. ఎందుకంటే, శరీర ఆరోగ్యమే, అందానికి పునాది. అందువల్ల అధిక ఫైబర్స్ కలిగిన ఆహారాలు మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మనకు చాలా అవసరం. మన రెగ్యులర్ డైట్ లో ఎంత మేరకు ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను చేర్చుకుంటామో అంతకు పదింతలు ప్రయోజనం పొందవచ్చు. అందవల్లనే మీ రెగ్యులర్ డైట్ లో ఫైబర్ ఫుడ్స్ చేర్చుకోవడం చాలా అవసరం. ఈ ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఒకే సమయంలో అనే ప్రయోజనాలను అందిస్తుంది. మీ బరువును కంట్రోల్లో ఉంచుకోవడం, గుండెను సురక్షితంగా ఉంచుకోవడం, క్రొవ్వును కరిగించడంలో మరియు హెల్తీ స్కిన్ అండ్ హెయిర్ పొందడానికి ఇది ఒక గొప్ప మూలం. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో సోలబుల్ మరియు ఇన్ సోలబుల్ ఫైబర్ ను చేర్చుకోవాలి. మీ దిన చర్యను ప్రారంభించడానికి ఒక ఉత్తమ మార్గం, అత్యధికంగా ఫైబర్ కలిగిన ఒక కప్పు ఓట్స్ తో మొదలుపెట్టండి. భోజన సమయంలో కొన్ని వెజిటేబుల్స్ మరియు సలాడ్స్ ను తీసుకోవడం ఉత్తమం. ఎప్పుడూ బ్రౌన్ రైస్ మరియు మిల్లెట్ వంటి అన్ రిఫైండ్ ధాన్యాలను ఎంచుకోవడం ఉత్తమం. ఈ తృణధాన్యాల మీ ఆహారంలో డైటరీ ఫైబర్ ను జోడిస్తుంది. ఇవే కాకుండా మరికొన్ని ఫైబర్ కలిగి ఆహారాలు కూడా ఉన్నాయి వాటిని మీ రెగ్యురల్ డైట్ లో చేర్చుకొని, ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోండి. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల పొందే ముఖ్యమైన ప్రయోజనాలను తెలుసుకోండి.

No comments:

Post a Comment