Wednesday 5 February 2014

స్థూలకాయానికి శ్రమే విరుగుడు

ఈ తరం తల్లులు టివిలతో ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారని నిపుణుల అంచనా. వీరి అధ్యయనం ప్రకారం-45సం||రాల క్రితం తల్లులకు
శారీరక వ్యాయామం పనుల ద్వారానే ఎక్కువగా జరిగేది. కాని ఇప్పటి తల్లులకు అన్ని యంత్రాలు అందుబాటులో ఉండటం వలన శారీరక వ్యాయామం తగ్గి టివిలకే ఎక్కువగా అతుక్కుపోతున్నారు. అప్పట్లో ''బట్టలు ఉతుక్కోవడం, వంట పని, ఇంటి పని, పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం, పిండి రుబ్బుకోవడం...'' లాంటి శారీరక వ్యాయామం ఉన్న పనులను స్వయంగా చేసుకునేవారు. కాని ఇప్పుడు మిక్సీలు, వాషింగ్‌ మెషిన్‌లు, గ్రైండర్‌లు అందుబాటులో ఉన్నాయి. మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తూ ఆర్ధికంగా బలంగా ఉండటం వలన జీతమిచ్చి పనివాళ్ళను పెట్టుకుంటున్నారు. డబ్బుతో సౌకర్యాలను కొనుక్కుంటున్నారు బాగానే ఉంది. కానీ, దాంతో శారీరక వ్యాయామాన్ని నష్టపోతున్న సంగతి మాత్రం గుర్తించడం లేదు.
ఇంట్లోనే ఉండే మహిళల కన్నా ఉద్యోగాలు చేసే మహిళలకు శారీరక వ్యాయామం ఇంకా తక్కువని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. వాహనాలను ఎక్కువగా ఉపయోగించడం వలన వారిలో శారీరక వ్యాయామం తగ్గుతుంది. ఇలా తరాలు మారే కొద్ది మహిళలలో శారీరక వ్యాయామం తగ్గి స్ధూలకాయుల సంఖ్య పెరుగుతుంది. వీరికి కలిగే సంతానం ఆరోగ్యంపై కూడా ఇది దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. శారీరక వ్యాయామం ద్వారా ఎలాంటి రోగాలూ దరిచేరకుండా చూసుకోవచ్చని నిపుణుల సలహా.

No comments:

Post a Comment