Thursday 13 February 2014

సింప్లిసిటికి మరో పేరు పవన్ కళ్యాణ్..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువత స్టైల్ కి ఒక ఐకాన్. ఈయన హెయిర్ స్టైల్ , డ్రెస్సింగ్ ని చాలా మంది ఫాలో అవుతుంటారు కూడా.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో రియల్ ఫైట్స్, స్టన్నింగ్ ఫైట్స్ తో విపరీతమైన అభిమానుల్ని సంపాదించుకొని అది ఇప్పుడు ఒక మేనియాలాగ తయారయ్యి ‘పవనిజం' గా మారింది. పవన్ కళ్యాణ్ అంటే కేవలం సినిమా హీరో కాదు....ఆయనొక ఇన్‌స్పిరేషన్ అంటూ ముందుకు సాగుతున్న ఫ్యాన్స్ ఇప్పటికే ‘పవనిజం' కాన్సెప్టును జనాల్లోకి తీసుకెళ్లడంలో తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్‌ అంటే ఎందుకింత అభిమానం అని ఏ అభిమానినయినాఅడిగితే.....మా హీరో మనసున్నహీరో, లవ్లీ నేచర్, గుడ్ బిహేవియర్ వీటికి తోడు అదిరిపోయే స్టైల్ అని గొప్పగాచెబుతుంటారు. చాలా సింపుల్ గానే ఉంటూ చాలా స్టైలిష్ గా కనబడుతుంటారు.


No comments:

Post a Comment